కందుకూరు పట్టణంలోనే అధికార పార్టీ అన్నదండలున్న కొంతమంది అనాధికారికంగా ఇసుక విక్రయిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇసుక నిలువలు ఉంచి రిటైల్ గా విక్రయిస్తున్న అడ్డుకునే ప్రయత్నం చేసిన దాఖలు లేవు లేవు. దాదాపు నెలలు తరబడి ఈ తతంగం జరుగుతుంది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక బంగారంగా మారిపోయింది. పట్టణ పరిసర ప్రాంతాల్లో మన్నేరు, పాలేరు, ఉప్పుటేరు వాగులున్నాయి. వాటిలో కొన్ని రీచ్ ల వద్ద పుష్కలంగా ఇసుక ఉన్న ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.