కొత్తిమీర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కొత్తిమీర తినడం వల్ల శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీరలో ఎముకలు బలంగా ఉండటానికి కావలసిన విటమిన్ ‘K' పుష్కలంగా ఉంది. కొత్తిమీర ఆహారాన్ని రుచి గానే కాకుండా జీర్ణక్రియ రేటుని కూడా పెంచుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియ వ్యాధులను, అజీర్ణం, వాంతులు వంటి వాటిని తగ్గిస్తుంది. కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది.