పేదరికాన్ని నిర్మూలించే దిశగా మరో అడుగు వేశామని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.2 లక్షల 79 వేల 279 కోట్ల వార్షిక బడ్జెట్‌ను.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. 'మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారిత, జోరైన పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా.. మరోసారి సంక్షేమ-అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్‌ద్వారా మరో అడుగు ముందుకేశాం' అని జగన్ ట్విట్ చేశారు.