రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంలోనూ అభివృద్ధి ప్రస్తానాన్ని కొనసాగించామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డి వెల్లడించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. ఆర్థిక మంత్రి బుగ్గన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర విభజన తరువాత అన్ని రంగాలను 2019 తరువాత పునః ప్రారంభించాం. విభజన సవాళ్లతో సతమతమవుతూ.. కోవిడ్ –19 మహమ్మారితో సహసోపేతమైన పోరాటం చేయాల్సి వచ్చింది. ఒక పక్క ప్రపంచ స్థాయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే.. మన రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య రక్షణ, జీవనానికి రక్షణ వలయాన్ని నిర్మించుకున్నాం. మరోపక్క రాష్ట్ర అభివృద్ధి ప్రస్తానాన్ని కొనసాగించాం. ఈ సంక్షోభ సమయంలో కూడా ఆరోగ్య సంరక్షణ నుంచి సుస్థిర అభివృద్ధి వరకు అన్ని రంగాల్లో సంక్షోభాన్ని అధికమిస్తూ.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చి యధాతథ స్థితికి తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేసింది' అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.