కేంద్ర లోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కార్. ఉగాదికి ముందే ఆ నిర్ణయం వెలువడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంపు దాదాపు ఒకే విధంగా ఉండనుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతుంటుంది కేంద్ర ప్రభుత్వం. సాధారణంగా ఏడాదిలో రెండు సార్లు పెంచుతారు. జనవరి, జులైలో చేస్తుంటారు. అయితే, మార్చి నెలలో డీఏ పెంపు ప్రకటన ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి ఎంత పెంపు కోరుతున్నారు.? ప్రభుత్వం ఎంత పెంచే అవకాశాలు ఉన్నాయి.
తాజా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ ఆధారంగా డీఏ లెక్కిస్తారు. ప్రతి నెలా కార్మిక శాఖ సీపీఐని విడుదల చేస్తుంది. దీనిని అనుసరించి డీఏ, డీఆర్ అలవెన్స్ లెక్కించేందుకు ఓ ఫార్ములా ఉంటుంది. 7వ వేతన సంఘం ప్రకారం డీఏ శాతం= [ {12 నెలల యావరేజ్ ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ (2001 ఏడాది ఆధారంగా)- 261.42 }/261.42x100]. దీని ప్రకారం 2001 బేస్ ఇయర్ ప్రకారం యావరేజ్ సీపీఐ-ఐడబ్ల్యూ 372.20గా ఉంది. ఈ లెక్కన ఈఏడాది డీఏ పెంపు 42.37 శాతానికి చేర్చాల్సి ఉంటుంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న 38 శాతం డీఏకు మరో 4 శాతం పెంచి 42 శాతానికి చేసే అవకాశాలు ఉన్నాయి.
డీఏ అనేది సాధారణంగా బేసిక్ సాలరీ ఆధారంగా లెక్కిస్తారు. ప్రతి ఒక్క ప్రభుత్వం ఉద్యోగి, పెన్షనర్‌కు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ వస్తుంది. డిఏ పెంపు అనేది టేక్ హోమ్ సాలరీని పెంచుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగికి రూ.25,500 బేసిక్ శాలరీ ఉందనుకుందాం. ప్రస్తుతం ఉన్న 38 శాతం డీఏతో ఆయనకు రూ.9,690 డియర్‌నెస్ అలవెన్స్ వస్తుంది. అయితే ఇప్పుడు కేంద్రం 4 శాతం పెంచి 42 శాతానికి చేరినట్లయితే డీఏ రూ.10,710 వస్తుంది. దీంతో అతడి శాలరీ రూ.10,710 - రూ.9,690= రూ.1,020 ఎక్కువగా ఉంటుంది. డీఏ పెంపు తర్వాత అతడి టేక్ హోమ్ శాలరీ రూ.1,020 పెరుగుతుంది.
మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు అందించే డియర్‌నెస్ అలవెన్స్ సైతం 4 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒక ఉద్యోగి రూ.35,400 నెలకి పెన్షన్ అందుకున్నట్లయితే ప్రస్తుతం 38 శాతంతో అతడికి డీఆర్ రూ.13,452 వస్తుంది. అదే డీఆర్ 42 శాతానికి పెంచితే అది నెలకి రూ.14,868 వస్తుంది. మొత్తంగా నెలకి రూ.1,416 ఎక్కువగా వస్తుంది.