ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఈ ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి కోసం స్పష్టమైన, నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తుందని కోన రఘుపతి తెలియజేసారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్ర క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ 31,000 కోట్లని, కానీ, గత ప్రభుత్వం ఎంత ఖర్చు చేసి, ఏ ఆస్తులు తయారు చేసిందో చెప్పగలదా? అని సవాల్ విసిరారు. కేపిటల్ ఎక్స్ పెండిచర్ కింద 31వేల కోట్లు ఖర్చు చేయడం వైయస్ జగన్ ప్రభుత్వంలోనే జరుగుతోందని, ప్రతి 2వేల జనాభాకు ఒక సచివాలయం, ఆర్బీకే, వెల్ నెస్ సెంటర్, బల్క్ మిల్క్ సెంటర్ వంటి అసెర్ట్స్ ని నిర్మిస్తున్నామని తెలిపారు. మన బడి నాడు నేడు ద్వారా పాఠశాలలను తీర్చిదిద్దుతూ, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే టీడీపీ మాత్రం ఏమీ జరగడం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు.