ప్రస్తుతం చాలా మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వివిధ వైరస్ ల దాడి వల్ల ఇలా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. వీటి బారి నుంచి సురక్షితంగా ఉండాలంటే పసుపు వాడకం పెంచాలి. పాలు, వేడి ద్రవ పదార్థాల్లో పసుపుతో పాటు మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. అల్లం, వెల్లుల్లి కూడా జలుబు, దగ్గును దూరంగా ఉంచుతాయి. ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. విటమిన్ సి ఉండే పండ్లను తింటే శ్వాస సమస్యలను పోగొట్టుకోవచ్చు.