ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అవుతోందని పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి 7500 ఓట్లతో గెలిచినప్పటికీ కూడా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా, కౌంటింగ్ కేంద్రం నుండి అధికారులు బయటికి వెళ్లిపోవడం సిగ్గుచేటు అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు విశ్వనాథ నాయక్ ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో అన్నారు. ఎన్నికల కమిషనర్ సంబంధించిన అధికారులు పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులను కూడా మరి ఇంత దిగజారుడు రాజకీయాలు సి ఎం ఓ కార్యాలయం చేయడం దౌర్భాగ్యం అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితేప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అధికార దుర్వినియోగం అహంకారం చాలా రోజులు పనికిరాదని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగా బద్దంగా పరిపాలనను అందించాలని తెలిపారు.