ఇటీవల కురుస్తున్న వర్షాలకు తమలపాకు తోటల రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలను పొన్నూరు మండల ఉద్యానవన శాఖ అధికారి ఉష ఆదివారం ఒక ప్రకటనలో రైతులకు వివరించారు. ఈదురు గాలులు తట్టుకునేలా తమలపాకు తోటల్లో అవిసి చెట్లను దృఢమైన బొంగుల సహాయంతో కట్టాలని సూచించారు. అలానే తోటలో అధిక నీరు నిల్వ ఉండకుండా రైతులు వాటిని బయటికి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేత మరియు ముదురు తోటలలో వంగిన లేత తీగలను మొక్కల దగ్గరకు మట్టిని ఎగదోయ్య లన్నారు. అవిశలను పలుసన చేసుకుంటే తోటలో తేమ శాతం త్వరగా ఆరిపోతుందని తద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. రైతులు పూర్తి సమాచారం కు స్థానిక ఉద్యానవన శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె కోరారు.