ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు గుంటూరులో మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రన్న ఉగాది కానుకలు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ.. కృష్ణ దేవరాయ కాలనీలో నిత్యవసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో పేదలు అన్ని పండుగలు సంతోషంగా జరుపుకున్నారన్నారు. వైసీపీ పాలనలో పేదలు పండగలు చేసుకోలేని దుస్దితి ఏర్పడిందన్నారు. అందుకే చంద్రబాబు ఆదేశాలతో ఉగాది కానుకలు పంపిణీ చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa