ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం రాత్రి యలమంచిలి టీడీపీ కార్యాలయం లో మాజి ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొర్ల నానాజీ, సెక్రెటరీ ఆడారి రమణబాబు, క్లస్టర్ బోద్దపు శ్రీనివాసరావు, టౌన్ ఉపాధ్యక్షులు గొర్లె బాబురావు, బీసెట్టి చిన్నారావు, సాగర్, హుస్సేన్, గుర్రాల రాము ఠాగూర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa