ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో.. విప్ ఉల్లంఘించినందుకు నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి శుక్రవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకుగానూ, క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకుగానూ నలుగురు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటం శ్రీధర్‌రెడ్డిపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు పార్టీ గుర్తించిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.