తమ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలూ పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాయని, పొల్యూషన్ నుంచి వాటిని కాపాడాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజు సంబంధిత మంత్రిని కోరారు. ఎమ్మెల్యే అదీప్‌రాజు మాట్లాడుతూ.. ``పరవాడ మండలంలో ఎన్‌టీపీసీ ఉంది. దాన్ని అనుకుని ఉన్న గ్రామాలు పిట్టవానిపాలెం, స్వయంభూవరం గ్రామాలు. ఈ రెండు గ్రామాలు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నాశనం అవుతున్నాయి. పాస్ఫరస్, పొటాషియం భూమిలో ఇంకిపోయాయని, సోడియం కార్బోనెట్ అత్యధికంగా పంట భూములను ఎఫెక్ట్ చేస్తోందని భూసార పరీక్షల్లో వెల్లడైంది. మెడికల్ హెల్త్ డిపార్ట్ మెంట్ వారు సర్వే చేసి ఇచ్చిన రిపోర్టులో కిడ్నీ సంబంధిత వ్యాధులు, కేన్సర్, చర్మ వ్యాధులు, ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు. కనుక ఈ ప్రాంత వాసులను పొల్యూషన్ బారి నుండి కాపాడేందుకు ఒక కమిటీవేసి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రిని కోరారు.