ఏపీలో 2023-24 విద్యాసంవత్సరానికి బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ EDCET-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు ఎటువంటి ఆలస్య రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్ టికెట్లు మే 12 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. పరీక్ష మే 20 తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ మే 24న విడుదల చేస్తారు.