వచ్చే విద్యా సంవత్సరం నాటికి 22 భాషల్లో కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసే ప్రణాళికపై కేంద్రం కసరత్తు చేస్తోంది. సోమవారం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన 1 నుంచి 3వ తరగతి పాఠ్యపుస్తకాలపై కీలక సమావేశం జరిగింది.విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఎన్‌సీఈఆర్‌టీ సీనియర్ అధికారులు, నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్‌పై నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశానికి హాజరైనట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.వచ్చే 3-4 నెలల్లో హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, గణిత పాఠ్యపుస్తకాలను వచ్చే విద్యా సంవత్సరం నాటికి అభివృద్ధి చేస్తామని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. పాఠ్యపుస్తకాలు, డిజిటల్ లెర్నింగ్ మెథడాలజీలను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందని, ఇక్కడ యోగ్యత ఆధారిత మదింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.