నంది మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ వృత్తిని సేవగా భావించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ నంది మెడికల్ కాలేజీ విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించిన సీఎం మాట్లాడుతూ.. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో జనాభాకు సరిపడేంత వైద్యులు లేరని, దేశంలో వైద్య సేవలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసిన తర్వాత ఎక్కువ మంది ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి అన్నారాయన. ఆది జగద్గురువు పంచాచార్య పాఠశాల ఏర్పాటుకు సీఎం బొమ్మై ఆదివారం తన సహాయ సహకారాలు అందించారని, రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులు విడుదల చేస్తుందని తెలిపారు.