వంగర మండలం మెట్టమగ్గూరు వద్ద ఉన్న తాగునీటి పథకము నుంచి మండల ప్రజలకు మంచినీటి సరఫరా బుధవారం నుంచి మొదలయ్యింది. మద్దువలస డ్యాములో నీటిని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు ప్రోక్లైనర్ తో కాలువను తవ్వించి మంచినీటి పథకానికి నీరందెలా చేశారు. దీంతో మెట్టమగ్గురు కొండపై ఉన్నటువంటి తాగునీటి పథకం ద్వారా గ్రామస్తులకు నీరు అందుతుంది. అధికారులు ప్రజలకు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వంగర మండలంలోని 20 గ్రామ పంచాయతీలకు, రేగిడి మండలం నాలుగు గ్రామాలకు నీటిని సరఫరా చేస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు.