ఫ్రిడ్జ్‌లో నిల్వ పెట్టిన ఆహారాన్ని చాలామంది తింటూ ఉంటారు. ఏవి పడితే అవి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తుంటారు. అయితే కొన్ని ఆహారపదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదట. అలాంటి వాటిని తింటే అనారోగ్యానికి గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగాళదుంపలు, అరటిపండ్లు, తేనె, కొత్తిమీర, పుదీనా, కాఫీ, టమాటాలు వంటివి ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టకూడదు. అలాగే ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహార పదార్థాలను కూడా తినకపోవటం మంచిదని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.