రేపల్లె మండలంలోని గంగడిపాలెం పంచాయతీ జొన్నవారిపాలెంలో మోపిదేవి రాజీవ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి గుంటూరు & కృష్ణాజిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు పాల్గొని పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్ నిర్వహణకు 50వేల విరాళం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa