IPL-2023లో భాగంగా మంగళవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్త లపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో లక్నో చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ రెండో మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది. మరోవైపు, చెన్నైపై విజయం సాధించిన జోష్‌లో ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్‌లోనూ తమ ప్రతాపం చూపించాలనుకుంటోంది. ఈ మ్యాచ్ సొంత గడ్డపై జరుగుతుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం. మరి నేటి పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.