రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి క్రికెట్‌కు దూరమైన టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ మళ్లీ మైదానంలో కనిపించే అవకాశముంది. నేడు ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్‌ను వీక్షించేందుకు తమ రెగ్యులర్ కెప్టెన్‌ను తీసుకొచ్చేందుకు ఢిల్లీ ఫ్రాంఛైజీ ప్రయత్నిస్తోంది. పంత్ ఫ్రాంఛైజీ యజమానుల ప్రాంతం నుంచి మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. అధికారులు అనుమతిస్తే కొంతసేపు డగౌట్‌లో కూడా ఉంటాడని తెలుస్తోంది.