కూర కాస్త ఉప్పు ఎక్కువో, తక్కువో అయితే తినలేం. తక్కువైతే ఇంకాస్త వేసి తినవచ్చు. కానీ ఎక్కువైతే దాన్నితొలగించలేం. దీనికి చిన్న చిట్కాతో ఉంది. కూరలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు లేదా చపాతీ తయారు చేయడానికి సిద్ధం చేసిన పిండి ముద్దలు అందులో వేసి కాసేపు ఉంచాలి. ఇవి ఉప్పును పీల్చుకుంటాయి. కూర వడ్డించేటప్పుడు వీటిని తీసేస్తే సరిపోతుంది. ఫ్రైలలో కాస్త శనగపిండి నీళ్లలో కలిపి పోస్తే ఉప్పు తగ్గుతుంది.