ఈకెవైసి వంద శాతం పూర్తి చేయాలని వ్యవసాయ అధికారి కృష్ణారెడ్డి సిబ్బందికి సూచించారు. ముద్దనూరు మండ లంలోని తిమ్మాపురం, పెనికలపాడు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను, డిజిటల్ కియోస్క్ మిషన్ పరి శీలించారు. అనంతరం ఏఓ మాట్లాడుతూ పెండింగులో ఉన్న ఇకెవైసి వంద శాతం పూర్తి చేయాలన్నారు. రైతులు ఎవరైనా మరణిస్తే ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించి, పిఎం కిసాన్ పోర్టల్ మరణం జాబితాలో నమోదు చేయాలని సూచించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ కు గ్రామాల వారీగా రైతులు పంటలు సాగు చేసే విస్తీర్ణం బట్టి కావాల్సిన క్రిమిసంహారక మందులు పరిమాణాన్ని నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాలన్నారు.