బద్వేలు పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జహంగీర్ యువసేన ఆధ్వర్యంలో గురువారం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జహంగీర్ భాష మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు వేసవిలో ప్రారంభమవుతాయి, కనుక విద్యార్థులకు ఉపశమనం కలిగేలా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాలుగా తమ వంతు బాధ్యతగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముని రెడ్డి, మాచుపల్లి వెంకటకృష్ణారెడ్డి, రాజన్న, బిజి వేముల చంద్రశేఖర్ రెడ్డి, భూమిరెడ్డి రామసుబ్బారెడ్డి, దానం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa