పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రారంభించారు. ప్రతి పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది కలిపి 14 మంది అందుబాటులో ఉంటారు. పీహెచ్‌సీలోని ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. వైద్యులు వాటిని నెలలో రెండు సార్లు సందర్శిస్తారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ ఉచితంగా అందిస్తారు.
దేశంలో గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టామని.. ఇది కచ్చితంగా దేశానికి రోల్ మోడల్ అన్నారు సీఎం జగన్. దేశ చరిత్రలోనే తొలిసారి వైద్యసేవల విధానంలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ఇకపై రాష్ట్రంలో డాక్టర్ కోసం ప్రజలు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. నేరుగా పెన్షన్లు ఏ మాదిరిగా ఇంటి వద్దకు వస్తున్నాయో.. అదే తరహాలో ఈ "ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్" ద్వారా వైద్య సేవలు ప్రజల ఇంటి ముందుకు రాబోతున్నాయన్నారు.
మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉన్నాయని.. ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్ ఉంటుందన్నారు. వైఎస్సార్ విలేజ్‌క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తామని.. 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇక్కడ సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని తెలిపారు. గత టీడీపీ పాలనలో వైద్య ఆరోగ్య రంగంపై రూ. 8 వేల కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైద్యారోగ్యంపై రూ. 18 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామన్నారు.
వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆరోగ్య శ్రీని నీరుగార్చారన్నారు సీఎం జగన్. ఖరీదైన కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా పేదలకు అందించిన మహానేత వైఎస్సార్ 2265 ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ విస్తరించారని.. 24/7 పేదలకు వైద్యం అందించాలన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా డాక్టర్ అందుబాటులో ఉంటారన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పరిధిలో నయం కాని ఆరోగ్య సమస్యలను విలేజ్ క్లినిక్ ద్వారా ఆరోగ్యశ్రీకి రిఫర్ చేస్తామని తెలిపారు. వైద్యులే గ్రామానికి వచ్చి సేవలు అందిస్తారు.. ఇకపై ఎవరూ ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు.
'నవరత్నాలతో మీ బిడ్డ వస్తుంటే.. తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి' అన్నారు సీఎం జగన్. వాళ్లలా తనకు అర్థబలం, అంగబలం లేకపోవచ్చు కానీ.. వాళ్లకు లేనిది తనకు ఉంది.. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు అన్నారు. తనను ఎదుర్కోలేక చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని.. తనకు కుయుక్తులు, మోసాలు చేయడం చేతకాదనర్నారు. తనకు ప్రజలు తప్ప ఇంకెవరూ లేరన్నారు. తనను ఎదుర్కొలేక ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులు చేస్తున్నారి ధ్వజమెత్తారు. 'మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు తోడుగా ఉండండి' అన్నారు.
స్కాములు తప్ప, స్కీములు తెలియన బాబులు.. సామాజిక న్యాయం తెలియన పరాన్న జీవులు అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకో, తినుకో, పంచుకో అన్నారని.. వయసు పెరిగినా బుద్ధి పెరగని క్రిమినల్ లంచావతారులు అంటూ ధ్వజమెత్తారు. తాను ఏదైతే చెప్తానో అదే చేస్తానని.. లంచాలు, వివక్ష లేకుండా పాలన చేస్తున్నామన్నారు. తనకు పొత్తుల్లేవ్.. పొత్తులపై ఆధారపడను అన్నారు. నాకు పొత్తు ఉంటే అది ప్రజలతోనే అన్నారు సీఎం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa