నిద్రలో వచ్చే కలలకు, పగటి కలలకు చాలా తేడా ఉంటుంది. ఇవి కేవలం మెలకువలో ఉన్నప్పుడే కొన్ని సెకన్ల పాటు వస్తాయి. మనం ఏదైనా సృజనాత్మకంగా పని చేసేటప్పుడు, బిజీగా ఉండేటప్పుడు ఎక్కువగా పగటి కలలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పగటి కలల స్థితిని మెదడు విశ్రాంతి తీసుకోవడంగా భావించాలట. పగటి కలల వల్ల మనుషుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.