దళితులు, మైనార్టీలపై దాడులకు వైసీపీ ప్రభుత్వం చిరునామాగా మారిందంటూ అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ధ్వజమెత్తారు. దాడులను నిరసిస్తూ...ఛలో విజయవాడలో పాల్గొనేందుకు సీపీఐ ఆఫీస్ నుంచి రైల్వేస్టేషనకు వెళ్తున్న సీపీఐ నాయకులను సోమవారం పోలీసులు అరెస్టుచేసారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ.... దళితులు, మైనార్టీలను గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే దళితులు, మైనార్టీల హత్యలు జరిగాయంటూ విమర్శలు గుప్పించారు. అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాలను ఈ ప్రభుత్వం అణచివేస్తోందన్నారు. కార్యక్రమం మల్లికార్జున, ఫిరోజ్, శ్రీరాములు, లింగమయ్య, పెద్దయ్య,రమణ, అల్లిపీరా, బంగారు బాషా తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa