తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర లో బాగంగా 1000 కీలో మీటర్ల పూర్తి చేసిన సందర్భంగా స్టీల్ టి యన్ టి యు సి ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి ఆధ్వర్యంలో శుక్రవారం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్ బాబు పాల్గొని మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రవేటికరణకు వ్యతిరేకంగా గడిచిన 799 రోజులుగా అలుపెరగని పోరాటాలు చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మికులుకు మరియు నిర్వాసితులుకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ టి యన్ టి యు సి ప్రధాన కార్యదర్శి నమ్మి సింహాద్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అఖిలపక్ష రాజకీయ పార్టీలును కలుపుకుని విశాఖ ఉక్కు ప్రవేటికరణకు కాకుండా బాధ్యత వహించాలని అన్నారు. అలాగే గతంలో బి ఐ ఎఫ్ అర్ కి వెళ్ళిన అప్పుడు చంద్రబాబునాయుడు, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు వాజపేయ్ ని ఒప్పించి కాపాడారని అన్నారు. యూనియన్ అధ్యక్షుడు గుమ్మడి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోందని పాదయాత్ర చూసి వైకాపా నేతలకు చెమటలు పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మండవ రఘప్రసాద్, భవానీ కుమార్ , గురుప్రసాద్, ప్రతాప్, పైలా అప్పలరాజు, జాగరపు ఎర్నినాయుడు, వెంకటరెడ్డి, నాగరాజు , అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు