శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవంనకు సుమారు లక్ష మందికి పైగా భక్తులు రానున్న నేపథ్యంలో విశాఖ నగర పోలీసు కమిషనర్ డా. సి. యం. త్రివిక్రమ వర్మ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం కె. కన్వెన్షన్ హాల్లో ఎస్. ఐ నుంచి పై స్థాయి అధికారులకు చందనోత్సం నిమిత్తం బ్రీఫింగ్ ఇచ్చారు. అధికారులు, కానిస్టేబుళ్లు నిర్దేశించిన ప్రాంతాలలో భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చందనోత్సవం విజయవంతంగా మరియు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. 2100 మంది పోలీసు సిబ్బంది మరియు అధికారులను ఈ బందో బస్తుకు వినియోగించినట్లు పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 7గంటల వరకూ దర్శనాలు జరుగుతాయన్నారు. నకిలీ టిక్కెట్లు, నకిలీ వీఐపీ పాస్‌లను గుర్తించే ఏర్పాట్లను చేశారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.