ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరి 17 వచ్చిన 12 చీతాలు,,,కునో నేషనల్ పార్కు ఎన్‌క్లోజర్‌లో క్యారంటైన్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 24, 2023, 10:48 PM

కునో జాతీయ పార్కులో మరో చీతా అనారోగ్యంతో మృతిచెందింది. అనారోగ్యానికి గురైన దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్అనే చీతా చికిత్స పొందుతూ చనిపోయినట్టు మధ్యప్రదేశ్ స్టేట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (CCF) జేఎస్ చౌహన్ ఆదివారం వెల్లడించారు. చీతా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. సాషా అనే ఆడ చిరుత కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో మార్చి 27న చనిపోయిన విషయం తెలిసిందే. నమీబియా నుంచి భారత్‌కు తీసుకురావడానికి ముందే సాషా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి.. కునో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు.


తాజాగా, మృతిచెందిన ఉదయ్‌.. ఈ ఏడాది ఫిబ్రవరి 17న దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన 12 చీతాల్లో (ఏడు మగ, ఐదు ఆడ) ఒకటి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువులుగా గుర్తింపు పొందిన చీతాలు భారత్‌లో అంతరించిపోయి ఏడు దశాబ్దాలు గడుస్తోంది. చివరి చీతా 1948లో చనిపోయిన తర్వాత దేశంలో వాటి జాడ పూర్తిగా కనుమరుగయ్యింది. భారత ప్రభుత్వం 1952లో వీటిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. చివరి చీతా చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో చీతాల జాడ లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 7,500 చీతాలు మాత్రమే ఉన్నాయి.


ప్రపంచం మొత్తం చీతాల్లోని సగం నమీబియా, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా దేశాల్లోనే ఉండగా.. మూడింట ఒక వంతు నమీబియాలో ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి వాటిని భారత్‌కు తీసుకొస్తున్నారు. మొదటి విడతలో గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి 8, రెండో విడతలో ఈ ఏడాది ఫిబ్రవరి 17న దక్షిణాఫ్రికా నుంచి 12 సహా మొత్తం 20 వరకూ చీతాలు భారత్‌కు చేరుకున్నాయి.


1930ల్లో చీతాలను వేటాడటం ఓ స్టేటస్ సింబల్‌గా భావించేవారు. అందుకే...లేదంటే వాటిని పెంచుకుని వాటితో వేరే జంతువులను వేటాడించేవారు. వేట కోసం వీటిని ఎక్కువగా వినియోగించేవారు. చీతాలు మాత్రమే కాదు. కాస్త ప్రత్యేకం అనిపించే జంతువులన్నింటినీ అప్పటి రాజులు, బ్రిటీషర్లు వేటాడేవారు. అలా మొదలైన వేట..క్రమంగా చీతాల సంఖ్యపై ప్రభావం చూపింది. అవి కనుమరుగవుతూ వచ్చాయి. 1939 నుంచి ఇది మరీ ఎక్కువైంది. 1972లో Wildlife Protection Act వచ్చేంత వరకూ ఈ వేట అలాగే సాగింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com