గుంటూరు నగరంలో ఉన్న ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం తనిఖీ చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల కు సంబంధించి వివరాలను ఈస్ట్ ట్రాఫిక్ సీఐ నిస్సార్ భాషని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మైనర్లు వాహనం నడిపితే జరిగే పరిణామాలు గురించి వారి తల్లిదండ్రులకు, వారికి కౌన్సిల్ ద్వారా తెలియజేయాలని అధికారులను సూచించారు. రాత్రి సమయంలో ట్రాఫిక్ డ్యూటీలు నిర్వహిస్తున్న సిబ్బంది కి ఎల్ఈడి లైట్స్ , ట్రాఫిక్ సిగ్నల్స్, పోలీస్ జాకెట్ భరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి సీఐ నరసింహారావు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.