తిరుపతిలో కాంగ్రెష్ నేత చింతామోహన్ సత్యాగ్రహం చేయనున్నారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేయాలని నిర్ణయించారు. కార్మికుల జీతాల పెంపుపై వచ్చేవారం సత్యాగ్రహం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ... టీటీడీలో పారిశుద్ధ్య కార్మికులకు రోజుకు రూ.300 లోపే ఇవ్వాలని ఏ చట్టం చెబుతోందని ప్రశ్నించారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే కార్మికులపై టీటీడీ వివక్ష ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. ప్రతి కార్మికుడికి నెలకు రూ. 20 వేలు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మే 1 నుంచి టీటీడీతో పాటు ఇతర విభాగాల్లో పనిచేసే ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి నెలకు రూ.20 వేలు ఇవ్వాల్సిందే అని అన్నారు. దేశంలో విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు ఇచ్చింది ఇందిరా గాంధీ అని... వైఎస్ రాజశేఖర్‌రెడ్డో, జగన్మోహన్ రెడ్డో కాదన్నారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం స్కాలర్ షిప్‌లు ఎందుకు ఆపారని నిలదీశారు. స్కాలర్ షిప్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చింతామోహన్ డిమాండ్ చేశారు.