కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 10న జరగనున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటకలో వరుస రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. నేడు ఆయన బెళగావి సౌత్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ రోడ్ షోకు ప్రజల నుండి ఊహించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో అమిత్ షా పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్ షో లో మొత్తం బైకులే ఉన్నాయని ప్రజలు లేరని అమిత్ షా అంటుండడం వీడియోలో రికార్డయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa