గాజువాక నియోజక వర్గ పరిధిలోని అగనంపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 85 వార్డ్ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ హాజరై ఉత్తీర్ణత పొందిన విద్యార్థులను మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా 574 మార్కులు సాధించిన షేక్ సాబిర్ మొహిద్దిన్, 559 మార్కులు సాధించిన దాసరి పూర్ణ పూజిత, 555 మార్కులు సాధించిన పెరుగు నాగమణిని, పరీక్షల్లో 500 మార్కులు దాటి సాధించిన 19 మంది విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యం. కృష్ణారావు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ బంధం అప్పలరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa