జులై 1 నుంచి సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ కింద బాలింతలు, గర్భిణులకు అందించే పోషకాహారం పంపిణీలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు వండి వడ్డిస్తున్న పరిమాణంలోనే ఇంటికే సరుకులు(టేక్ హోం రేషన్)(టీహెచ్‌ఆర్) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా 1-5 తేదీల్లో మొదటి విడతగా బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, నూనె, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం చిక్కీలు, ఎండు ఖర్జూరం అందించనున్నారు. 16-17 తేదీల్లో రెండో విడతగా పాలు, కోడిగుడ్లు, ఇవ్వనున్నారు. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న 500 గ్రాముల వంతున జొన్న పిండికి బదులుగా కిలో రాగి పిండి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ల నిర్వహణకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది.