బాధితులు పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీలో భాగంగా మూడో విడత రూ.33 లక్షల విలువ గల 165 సెల్‌పోన్లు రికవరీ చేసినట్లు కడప జిల్లా, రాయచోటి ఎస్పీ గంగాధర్‌రావు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మొబైల్స్ ట్రేస్, సైబర్ క్రైమ్, టెక్నికల్ ఎనాలిసిస్ వింగ్ సిబ్బంది కృషితో ఇప్పటి వరకు మొత్తం రూ.82 లక్షల విలువైన 404 మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రకవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ఇందులో భాగంగానే మొదటి విడతలో రూ.23 లక్షలు విలువైన 109 మొబైల్ ఫోన్లు, రెండవ విడతలో రూ.26 లక్షల విలువైన 130 మొబైల్ ఫోన్లు, మూడవ విడతలో రూ.33 లక్షల విలువైన 165 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోతే జిల్లా పోలీసు వాట్సాప్ నెంబర్ 86888 30012కు హాయ్ అని టైప్ చేయడం ద్వారా పోయిన మొబైల్ ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్‌ఐఆర్ కట్టకుండా, పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా సులభతరంగా రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా పోలీసులు అతి తక్కువ సమయంలోనే మూడవ విడతలో భాగంగా వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి రకవరీ చేసిన 165 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశామన్నారు.