రైతులు తమ పొలాలలో భూసార పరీక్షలు చేయించుకొని ఫలితాలకు అనుగుణంగా ఎరువులు, పురుగుమందులు వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చునని ఎఒ బాలాజీ గంగాధర్ తెలిపారు. చెరుకుపల్లి లోని రైతు భరోసా కేంద్రం వద్ద భూసార పరీక్షలకు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో మట్టి నమూనాలు సేకరించి రైతులకు భూసార పరిస్థితిపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa