పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో శుక్రవారం భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అదుపుతప్పిన లారీ గోడను ఢీకొంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రహరి గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లినర్ రాకేష్‌కు గాయాలు అవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. లారీ గుంటూరు నుంచి జొన్నల లోడ్‌తో హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa