ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్‌ భారాన్ని తగ్గించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 19, 2023, 12:22 PM

‘‘విద్యుత్‌ వినియోగదారులపై పెనుభారం మోపనున్న విద్యుత్‌ మీటర్ల టెండర్‌ ప్రక్రియను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే రద్దు చేయాలి. ఈ కాంట్రాక్టు ద్వారా ఏడేళ్లపాటు నెలకింత అని రూ.26 వేల కోట్ల నిర్వహణ భారాన్ని వసూలు చేయనున్నారు. కేంద్రం సూచించిన దాని కంటే 240ు అధిక మొత్తానికి ఒక కంపెనీకి ఈ కాంట్రాక్టును కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది?. కేంద్ర ప్రభుత్వం మీటరుకు రూ.6 వేలు మాత్రమే అని సూచించింది. ఇప్పటివరకు ఒక్క మీటర్‌ కూడా సరఫరా చేయని సంస్థకు ఈ మీటర్ల కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇదే విషయం మీద రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం విచారణ జరిపిస్తే జగన్మోహన్‌ రెడ్డి జీవితకాలం జైలులోనే గడపాల్సి వస్తుంది’’ అని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. ఈ టెండర్‌ను రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమాలు తప్పకపోవచ్చ’ని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com