గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. శుక్రవారం సాయంత్రం బీచ్ లో పిక్నిక్ కు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa