మూర్చ వ్యాధి నివారణకు ఉపయోగించే మందుతో బ్రెయిన్ క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని అమెరికాలోని ఇండియన్ సైంటిస్ట్ సరిత కృష్ణ ఆధ్వర్యంలోని బృందం కనుగొంది. బ్రెయిన్ క్యాన్సర్లలో అతి ప్రమాదకరమైన గ్లియోబ్లాస్టోమా వ్యాధిపై జరిపిన పరిశోధనలో ఈ విజయం సాధించింది. మూర్చ వ్యాధి నివారణకు వాడే గాబాపెంటిన్ అనే మందు గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ కణాలు హైపర్ యాక్టివ్గా మారకుండా ఈ మందు అడ్డుకుంటుందని, ట్యూమర్ పెరుగుదలను ఆపేస్తుందని కనుగొన్నారు.