గాజువాక నియోజకవర్గ పరిధిలోని 74వ వార్డు పరిధి మార్వెల్ స్కూల్ ప్రాంగణంలో జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపు ను మంగళవారం నిర్వహించారు. ఈ నెల 22 నుండి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపును 74 వ వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొని జోన్-6 కమిషనర్ పీ సింహాచలంతో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్భంగా వంశీరెడ్డి మాట్లాడుతూ వేసవి సెలవులలో విద్యార్థులు టీవీలు, సెల్ ఫోన్ లు, వీడియో గేమ్లపై అధికంగా దృష్టిపెట్టడం వల్ల వారికీ కంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు తలేత్తడం వంటివి జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి పెట్టి వారి కోసం ఇటువంటి సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోందని చెప్పారు. ఈ క్యాంపులో విద్యార్థులకు క్రీడలు, యోగ, మెడిటేషన్ వంటివి శిక్షణ ద్వారా నేర్పుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇ ఎస్ వెంకటరావు, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి, శ్రీనివాసరావు, రమేష్ కుమార్, మధు పాల్గొన్నారు.