కడప బెంగుళూరు వయా రాయచోటి నుండి వెళ్లే రైల్వె లైన్ ను రద్దు చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి లేక రాశారంటే అర్థమవుతుంది ఈ ప్రాంత ప్రజల పైన పాలకులకు ఎంత ప్రేమవుందో అర్థమవుతుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బుధవారం రాయచోటి సాయిశుభ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ రాజంపేట కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి నుండి భారతీయ జనతా పార్టీని పటిష్ట పరచి పార్టీని ముందుకు తీసుకెళ్లడమే ముఖ్య లక్ష్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన 9 సంవత్సరాల నుండి దేశానికి చేసిన సేవ, రాష్ట్రలకు అందించిన సహకారం ద్వారా ప్రజలకు జరిగిన మేలును ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ప్రజలకు చేరువవుతామని తెలియపరిచారు. నేడు రాష్ట్రంలో ఆరాచక, విధ్వంసపూరీత పాలనతో నేడు ఆంధ్ర ప్రదేశ్లో ఆర్థిక సంక్షోభంలో నడుస్తుందనీ అన్నారు.
కేంద్రం నుండి వస్తున్న నిధులను సరైన లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా ప్రక్కదారి పట్టించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తారీకున జీతాలు చెల్లించలేని పరిస్థితులలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరం అన్నారు. వైసిపికి చెందిన సర్పంచులు నేడు తమకు కేటాయించిన నిధులను ఇవ్వలేని దీనావ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇన్ని నిధులు ప్రక్కదోవ పాటించిన రాష్ట్ర అభివృద్ధిని దూరం చేసిందని విమర్శించారు.