అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఆర్డినరీ పాస్‌పోర్టు కోసం నిరభ్యంతర పత్రం కోరుతూ ఆయన చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు అంగీకరించింది. మూడేళ్ల కాలానికి గానూ ఆయనకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో రాహుల్ త్వరలోనే కొత్త పాస్‌పోర్టు పొందేందుకు వీలు లభించినట్లయింది. కాగా, అనర్హత వేటు వల్ల లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్, తన దౌత్య హోదా పాస్‌పోర్టు (Diplomatic Passport)ను అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే.