సీఎం జగన్పై మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. పేదల సంక్షేమం పేరుతో దోపిడీకి పాల్పడిన దరిద్రుడు జగన్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో పన్నుల మోత, నిత్వావసర వస్తువుల మోత, కరెంటు చార్జీల మోతతో ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాజధానిని సర్వనాశనం చేసేందుకే పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు.