తిరుమలఘాట్ రోడ్డులో వేగనిబంధనను తిరిగి అమలుచేస్తామని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఏఎస్పీ మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఇటీవల తిరుమల ఘాట్‌రోడ్లలో నిర్లక్ష్యం, అవగాహనలోపం, దూరప్రయాణం చేసి అలసటతో నిద్రించడం వంటి కారణాలతో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయన్నారు. ఘాట్‌రోడ్లలో డ్రైవింగ్‌పై అవగాహన లేని వారు సొంత వాహనాలను తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. కొంతమంది రోడ్డుపై వాహనాలునిలిపి ఫొటోలు తీసుకుంటున్న క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, భక్తులు ఈ పద్ధతిని మానుకోవాలన్నారు. ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్న టెంపో, తుఫాన్ వాహనాలను తిరుమల ఘాట్‌పై నిషేధించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు.