రైతు భరోసా-పిఎం కిసాన్ పతకాల కింద రైతులకు పెట్టుబడి సాయం, ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీని కర్నూరు జిల్లా పత్తికొండ నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో పల్నాడు కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎల్. శివశంకర్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఐ. మురళి వర్చువల్‌గా పాల్గొన్నారు. రైతు భరోసా జిల్లాలో 2, 55, 705 రైతులకు రూ. 140. 96 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ తెలిపారు. పల్నాడు జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే నెలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కింద 3224 మంది రైతులకు చెందిన 5673. 89 ఎకరాలకుగాను రూ. 294. 15 కోట్ల మంజూరైనట్లు వివరించారు. ఈ మేరకు మెగా చెక్కులను లబ్ధిదార్లకు అందించారు.