రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో విశాఖ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. గురువారం ఆమె గాజువాక జోన్ పరిధిలోని 79, 87, 88 వార్డుల పరిధిలోని అగనంపూడి, వడ్లపూడిలోని సిద్ధార్థనగర్, యాదవ్ జగ్గరాజుపేట తదితర ప్రాంతాలలో పలు అభివృద్ధి పనులకు సుమారు రూ. 112. 08 లక్షలతో స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, ఆయా వార్డుల కార్పొరేటర్లు రౌతు శ్రీనివాసరావు, బొండా జగన్నాథం, మొల్లి ముత్యాల నాయుడులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో విశాఖ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని, ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు విశాఖ నగరంలో చేపట్టడం జరిగిందని, అదేవిధంగా 79వ వార్డులో రూ. 48. 80 లక్షల వ్యయంతో బర్నింగ్ ప్లాట్ ఫామ్, 87వ వార్డ్ లోని రూ. 19. 98 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, బరియల్ గ్రౌండ్, ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, 88వ వార్డులో రూ. 43. 30 లక్షల వ్యయంతో స్మశాన వాటికలో బర్నింగ్ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసామన్నారు. విశాఖ నగరాన్ని ఒక మోడల్ నగరంగా తీర్చిదిద్దేందుకు శాసనసభ్యులు, కార్పొరేటర్లు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. సమస్యల పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో జగనన్న ముందున్నారని కొనియాడారు. ఎంతోమంది అక్కాచెల్లెలను అక్కున చేర్చుకుని వారిని ఆర్థికంగా ఎదిగేందుకు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం స్థానిక నాయకులు ఆయా గ్రామ ప్రజల సమస్యలను వినతపత్రాన్ని స్థానిక శాసనసభ్యుల ద్వారా మేయర్ కి అందజేశారు.
ఈ కార్యక్రమానికి జోనల్ కమిషనర్ సింహాచలం, కార్యనిర్వాహన ఇంజనీర్ ప్రసాద్ బాబు, ఉప కార్య నిర్వహణ ఇంజనీర్ అప్పారావు, మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, వివిధ వార్డ్ వైసిపి ఇన్చార్జులు మహాలక్ష్మి నాయుడు, ఆప్పికొండ మహాలక్ష్మి నాయుడు, కోమట శ్రీను, ప్రసాద్, సచివాలయం సెక్రటరీలు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.