రాయలసీమలో బలిజలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడానికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని నారా లోకేష్ అన్నారు. మైదుకూరు నియోజకవర్గం భూమాయపల్లెలో బలిజ వర్గీయులతో లోకేష్ సమావేశమయ్యారు. రాయలసీమలో బలిజల్ని జగన్ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదన్నారు. తమ పిల్లలు విదేశాల్లో చదువుకుంటే చాలు పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదని భావించి జగన్ విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశారని విమర్శించారు.కాపులకు గతంలో అమలు చేసిన రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని లోకేశ్ స్పష్టం చేశారు. పేదరికానికి కులం, మతం, ప్రాంతం లేవని, బలిజలకుపెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.