టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఉండవల్లి కరకట్ట వద్ద గల లింగమనేని ఇంటి విషయంలో కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటిని జఫ్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్‌మెంట్ కు అనుమతివ్వాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని జఫ్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించవలసి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు. మే 18న నోటీసులు జారీ చేసిన కారణంగా లింగమనేని రమేశ్ కు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.